రాప్తాడు: బండమీద పల్లిలో 70 గొర్రెలు, మేకల మృత్యువాత

71చూసినవారు
రాప్తాడు: బండమీద పల్లిలో 70 గొర్రెలు, మేకల మృత్యువాత
రాప్తాడు మండలంలోని ఎం.బండమీదపల్లిలో సోమవారం అర్ధరాత్రి గ్రామ చెరువు తెగిపోవడంతో లావణ్య అనే మహిళకు చెందిన 70 గొర్రెలు, మేకలు కొట్టుకుపోయాయి. తన ఆరేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురితో కలిసి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేదని బాధితురాలు మంగళవారం వాపోయారు. 80లో పదింటిని మాత్రమే కాపాడుకోగలిగామని చెప్పారు. కాగా ఈమె భర్త మాధవయ్య 5 రోజుల క్రితం మృతిచెందగా, పెద్దకొడుకు పాముకాటుతో ఇటీవల చనిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్