రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండల కేంద్రానికి చెందిన టీడీపీ కుటుంబసభ్యుడు ఈడిగ వెంకటేష్ గౌడ్ రెండు రోజుల క్రితం గుండె పోటుకు గురై మరణించాడు. దీంతో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం మృతుడు వెంకటేష్ గౌడ్ నివాసానికి స్థానిక నాయకులతో కలసి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు.