చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండిలో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉదయం అంజలి సుఖప్రసవంతో మగబిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కానీ సాయంత్రానికి తొమ్మిదేళ్ల కొడుకు దీక్షిత్ చెరువులో మునిగిపోవడం తల్లిదండ్రుల గుండెలు చెండెక్కించింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన అమ్మమ్మతో కలిసి చెరువు వద్దకు వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగింది.