రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం వెంకటాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాప్తాడు ఎమ్మెల్యే సునీత పంపిణీ చేశారు. కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాలకు చెందిన 12మంది లబ్ధిదారులకు 4లక్షల 63 వేల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ఎమ్మెల్యే సునీతకు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.