రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. రామగిరి మండల కేంద్రంలో ఆమె కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కె ఫెడ్, వ్యవసాయ శాఖల అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ కేంద్రం రైతులకు ఉపయోగకరమన్నారు.