రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును శుక్రవారం ఉదయం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత విజయవాడలోని మంత్రి కార్యాలయంలో కలిశారు. నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం త్వరగా అందించి పనులు ప్రారంభించాలని కోరారు. అలాగే చెరువుల మరమ్మతులు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.