ఏరువాక పౌర్ణమి సందర్బంగా బుధవారం రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలం, బసంపల్లి గ్రామంలో రైతు చెండ్రాయుడు పొలంలో ఏరువాకను ఎంఎల్ఏ పరిటాల సునీత ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసి, రైతన్నల భూముల్లో సిరుల పంట పండాలని ఆకాంక్షిస్తూ రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.