రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి మండలం నసన కోట గ్రామంలో నిర్వహిస్తున్న దుర్గమ్మ ఉత్సవాల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా దేవస్థానం దగ్గర సుమారు 40 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ప్రొటెక్షన్ వాల్ (రక్షణ గోడ), రైలింగ్, అదనపు సౌకర్యాలు, నాగుల కట్ట నిర్మాణాలను నాయకులు, గ్రామస్థులతో కలసి ప్రారంభించారు.