చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లి గ్రామంలో 40లక్షల NREGS నిధులతో నిర్మించిన సిసి రోడ్లను మరియు పశువులు, గొర్రెలు, మేకల దాహార్థి తీర్చడానికి 35వేలతో నిర్మించిన మంచినీటి తొట్టెను అధికారులు, మండల, పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఎంఎల్ఏ పరిటాల సునీత బుధవారం ప్రారంభించారు. అనంతరం ఈ మధ్యనే మరణించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కిష్టప్ప గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.