రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం నసనకోట పంచాయతీ పరిధిలోని ఎగువపల్లి (కొత్తగేరి) గ్రామంలో బస్టాండ్ సెంటర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రూ.30లక్షలతో నిర్మించిన బిటి రోడ్డును గురువారం ఎమ్మెల్యే సునీత పరిశీలించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఎమ్మెల్యే సునిత ఈ రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేశారు. కాగా రామగిరి మండలం నసనకోట పంచాయతీ వెంకటాపురంలో రూ.60లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్లను కూడా పరిశీలించారు.