రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీత మంగళవారం సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.