కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.