రామగిరి మండలంలోని వెంకటాపురంలో శుక్రవారం ఉదయం తిరుమల దేవర వేంకటేశ్వర స్వామిని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ధర్మవరం టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ ఉన్నారు.