రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం అసెంబ్లీలో రైతుల సమస్యలపై గళమెత్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని చెప్పారు. తక్కువ నీటితో పండ్లతోటలు సాగుచేస్తున్నారని తెలిపారు. రైతులకు 10 ఎకరాల వరకు సబ్సిడీ కింద బిందు సేద్య పరికరాలు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు సడలిస్తే ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వివరించారు.