చెన్నై కొత్తపల్లిలోని బస్టాండు వెనుక భాగంలో తమ ఇంటికి దారి చూపాలని బోయ ఆదిలక్ష్మి అనే మహిళ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ కు సోమవారం విన్నవించుకున్నారు. 40 సంవత్సరాలుగా తాము అక్కడ నివసిస్తున్నామని, తమ ఇంటికి వెళ్లేదారిలో మరో వ్యక్తి మరుగుదొడ్డి నిర్మాణం కోసం పెద్ద గుంతను తవ్వాడన్నారు. దీంతో తమ ఇంటికి వెళ్లడానికి దారి లేదని పేర్కొంటూ విన్నవించుకున్నారు.