రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని చెరువుల మరమ్మతులు, పునర్నిర్మాన పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. మంగళవారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో అనంతపురం మరియు ధర్మవరం డివిజన్లకు సంబంధించిన జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.