రాప్తాడు పోలీసులపై ఓ మహిళ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు మంగళవారం ఫిర్యాదు చేశారు. రాప్తాడు పట్టణంలో ముని అనే వ్యక్తి తనను కొడుతున్నారని, అతని ద్వారా ప్రాణహాని ఉందని రామాంజినమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ కు వెళ్లగా తనను పోలీసులు దూషించారని తెలిపారు. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.