వెలుగు అధికారులు, సిబ్బంది మహిళా సంఘాలు బలోపేతానికి కృషి చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. రామగిరి వెలుగు కార్యాలయంలో చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగాణపల్లి మండలాల అధికారులు, సిబ్బందితో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వాలంబన సాధించేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వం అందించే పథకాలు వారికి వివరించాలన్నారు.