యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. సోమవారం యోగాంధ్ర-2025 కార్యక్రమంలో భాగంగా రాప్తాడులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి రాప్తాడు మండల కేంద్రంలోని ప్రధాన వీధుల మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈకార్యక్రమంలో అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.