రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పూర్తయ్యాకే గ్రామంలో అడుగు పెట్టానని తెలిపారు. చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో నూతన రహదారిని సోమవారం ప్రారంభించారు. గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపిస్తూ, ఎడ్లబండిపై గ్రామంలో తీసుకువచ్చారు. రోడ్డు పూర్తయిన ఆనందం గ్రామస్థుల హర్షాతిరేకాలతో వ్యక్తమైందన్నారు.