బెలుగుప్పకు చెందిన నిర్మలమ్మ అనే మహిళా రైతు 4 ఎకరాల్లో కంది పంట సాగు చేసి విక్రయించగా వచ్చిన నగదును బ్యాంకు అకౌంట్లో జమ చేశారు. 9వ తేదీ ఉదయం, రాత్రి మెసేజ్లు ఫోన్కు వచ్చాయి. బ్యాంకుకు సంబంధించిన మెసేజ్లు అనుకుని నిర్మలమ్మ వాటిని ఓపెన్ చేశారు. 10వ తేదీ మధ్యాహ్నం రూ.99 వేలు ఖాతాలో నుంచి మాయమైందని తెలుసుకుని, బ్యాంక్ ను సంప్రదించగా సైబర్ నేరగాళ్ల పనేనని తేలింది. ఆమె శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు.