రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలోని ఉంతకల్లు కాలువలోకి గుర్తుతెలియని శవం కొట్టుకొచ్చింది. గురువారం అటుగా వెళుతున్న స్థానికులు కొట్టుకొస్తున్న శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని వెలికి తీయించారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.