అనంతపురం జిల్లా కణేకల్లు మండల కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. కురుబ జశ్వంత్ (6) అనే బాలుడు ఎద్దుల బండిపై నుంచి పడి మృతి చెందాడు. సెలవులు కావడంతో తండ్రితోపాటు శుక్రవారం ఉదయం ఎద్దుల బండిపై పొలానికి వెళుతుండగా అకస్మాత్తుగా కిందపడి బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.