అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శనివారం బళ్లారి రోడ్డులో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుండి వినాయక సర్కిల్ మీదుగా డప్పు చప్పులతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జిహ్వేశ్వర మహారాజ్ కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపడుతూ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కలశాలతో ఊరేగింపులో పాల్గొన్నారు.