డి. హీరేహల్ మండల పరిధిలోని కల్యం గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి తెలిపారు. కళ్యం గ్రామానికి చెందిన బొమ్మలింగప్ప తన ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో బళ్లారి నుంచి వస్తున్న లారీ వచ్చి ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని చెప్పారు.