గుమ్మఘట్ట మండలం దేవరెడ్డిపల్లిలో బుధవారం విద్యుదాఘాతంతో రాధిక(33) అనే మహిళ మృతి చెందింది. ఇల్లు తుడుస్తుండగా ప్రిడ్జ్ తీగ తెగి ఇనుప బీరువాకు తగలడంతో విద్యుత్ ప్రవహించింది. అది గుర్తించని ఆమె బీరువాను తాకడంతో కుప్పకూలింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త రవి, ఐదేళ్ల కవల పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.