కంబదూరు మండలంలోని కురాకులపల్లి గ్రామంలో హరిజనుల పట్ల కుల వివక్ష ఉందని ఆరోపణలున్నాయి. రెండు గ్లాసుల పద్దతి, కటింగ్ తీయకపోవడం, దేవాలయ ప్రవేశం వంటి సమస్యలకు గురి అవుతున్నామని ఆ గ్రామ హరిజనులు కొందరు పిర్యాదు చేశారు. తహసీల్దారు బాలకిషన్, పోలీసులతో కలసి గురువారం ఆ గ్రామానికి వెళ్లి విచారించారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంత బాబు ఘటనపై ఆరా తీశారు.