కణేకల్: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి: తహశీల్దార్

79చూసినవారు
కణేకల్: అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి: తహశీల్దార్
అనంతపురం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కణేకల్ మండల తహశీల్దార్ మండల ప్రజలకు అకాల వర్షాల పట్ల అప్రమత్తం సూచనలు జారీ చేశారు. రాబోయే రెండు రోజులు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ప్రజలు పొలాలకు వెళ్లేటప్పుడు, కాలువలు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం వస్తున్నప్పుడు బయట చెట్ల కింద ఉండకూడదని, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్