కణేకల్లు పట్టణంలో అత్యధికంగా ముస్లిం ఘోరీలు(సమాధులు) నెలకొల్పిన నేపథ్యంలో ప్రహరీ లేక వివిధ జాతుల జంతువుల స్వైరవిహారం, బయట వ్యక్తుల సంచారంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. పూర్తి స్థాయిలో ప్రహరీ నిర్మాణంకు శ్రీకారం చుట్టాలని కణేకల్లు ముస్లిం కబరస్తాన్ అభివృద్ధి కమిటీ శనివారం రాయదుర్గం నియోజక వర్గ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులుకు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం రూపంలో విజ్ఞప్తి చేసింది.