రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న హత్య కేసును చేదించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రంగంలో దింపామని డిఎస్పి శ్రీనివాసులు బుధవారం మీడియాతో తెలిపారు. గొల్ల ఆది కేసులు అలియాస్ ఆదెప్ప కర్ణాటక నుండి నిన్నటి రోజు తన స్వగృహానికి వస్తుండగా మారునాయుధాలతో గుర్తు తెలియని దుండగులు హత్య చేశారన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామన్నారు.