కణేకల్ మండలం మాల్యం ఎస్సీ కాలనీ కి చెందిన ఎం. యల్లప్ప (72) విధ్యుత్ షాక్ తో మృతి చెందారు. ఇంటి పై కప్పు నిర్మించుకోవడానికి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో హగరిలో గడ్డి కోస్తూ ఉండగా ప్రమాద వశాత్తు విధ్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. మృతునికి 2 కుమారులు, 3 కుమార్తె లు ఉన్నారు. యల్లప్ప మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.