సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎంఎల్ఏ కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎంఎల్ఏ ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో పంపిణీ చేశారు. ఎంఎల్ఏ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.