రాయదుర్గంలో నగరవనం పార్కును సందర్శించిన ఎమ్మెల్యే కాలవ

64చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని బళ్లారి రోడ్డులో ఉన్న నగరవనం పార్కును రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం సందర్శించారు. ఆయన ఫారెస్టు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డితో కలసి నగరవనంలో కలియదిరిగారు. నగరవనం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పార్కులో అన్ని హంగులు ఉండేలా చూడాలని ఫారెస్టు అధికారులను ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్