డీ. హీరేహాళ్ మండలం గొడిసెలపల్లికి శనివారం ఆర్టీసీ బస్సును రాయదుర్గం ఎమ్మెల్యే, విప్ కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు. 16 ఏళ్లుగా ఆ ఊరికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు. కలెక్షన్స్ తగ్గాయని అప్పట్లో బస్సును రద్దు చేశారు. అప్పటి నుంచి ఆటోలు, బైకులపై గ్రామస్థులు ప్రయాణాలు సాగిస్తున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు పలుమార్లు వేడుకున్నారు. చివరికి ఎమ్మెల్యే చొరవతో ఆర్టీసీ బస్సును ప్రారంభించారు.