విద్యుత్తు బిల్లు చెల్లించకపోవటంతో ఇంటికి చెందిన కనెక్షన్ తొలగించామనే కోపంతో విధి నిర్వహణలో ఉన్న తనపై నాగభూషణ అనే వ్యక్తి దాడి చేసినట్లు జనార్ధన్ శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజితో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ డీఈ శ్రీనివాసులు పోలీసులను కోరారు. ఈ ఘటనలో ఇద్దరిని పిలిపించి విచారిస్తామని పోలీసులు తెలిపారు. విద్యుత్తు సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.