ఏడాదిలో భైరవానీతిప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కృష్ణా జలాలతో నింపుతామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయంలో ఆగిపోయిన జీడిపల్లి, భైరవానితిప్ప పనులను శనివారం బ్రహ్మసముద్రం మండలం వెస్ట్ కోడిపల్లి వద్ద ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కాలవ మాట్లాడుతూ.. వెనుకబడ్డ రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారన్నారు.