రాయదుర్గం మండలం రాయంపల్లిలో అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ ఫోటోతో ఉన్న నేమ్ బోర్డు ఏర్పాటు చేయడంపై సోమవారం దళిత, అగ్రవర్ణాల ఘర్షణ చోటుచేసుకుంది. కలెక్టర్ గంధం చంద్రుడు దళిత, ఎస్సీ కాలనీల పేర్లకు బదులు జాతీయ నాయకుల పేర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రాయంపల్లి దళితవాసులు అంబేద్కర్ నేమ్ బోర్డు ఏర్పాటు చేస్తుండగా ఈ ఘర్షణ జరిగింది. పోలీసులు అక్కడ చేరుకొని వారికి సర్ది చెప్పి గొడవ ఆపారు.