బొమ్మనహళ్ మండలం ఉంతకల్లు గ్రామంలో వ్యక్తి అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బొమ్మనహళ్ ఎస్ హెచ్ఓ కమాల్ బాషా తెలిపిన వివరాల ప్రకారం ఉంతకల్లుకి చెందిన కురుబ బసవరాజు గత నెల 26న తన ఊరికే చెందిన రవి అనే వ్యక్తితో కలిసి క్లీనర్ పని చేసేందుకు హైదరాబాద్ కు లారీలో వెళ్లాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో బసవరాజు భార్య అనంతమ్మ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.