రాయదుర్గం: వర్షానికి నీట మునిగిన పంటలు

54చూసినవారు
రాయదుర్గం: వర్షానికి నీట మునిగిన పంటలు
బొమ్మనహాళ్ మండల వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు రైతులు సాగుచేసిన పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని గురువారం రైతులు కోరారు.

సంబంధిత పోస్ట్