రాయదుర్గం ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ ను అనంతపురం ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ నాగమద్దయ్య, అసిస్టెంట్ కమీషనర్ మునిస్వామి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు గీత కులాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వారికి కేటాచించిన మద్యం దుకాణాల గురించి వివరించారు. రాయదుర్గం పరిధిలో ఈడిగ కులాలకు-2, గౌడ కులానికి-1, గౌండ్ల కులానికి-1 మద్యం దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు.