రాయదుర్గం మున్సిపల్ పరిధిలోని శివారు కాలనీల్లో విద్యుత్తు దీపాల ఏర్పాటుకు దాతలు సహకరించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని గౌడ లేఅవుట్ లో దాతలు అందించిన 500 దీపాలు పలు కాలనీల్లో ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు, కౌన్సిలర్లు జ్యోతి, ప్రశాంతి, నాయకులు హనుమంతు, భారతి పాల్గొన్నారు.