రాయదుర్గం: రెండు వాహనాలు ఢీ

77చూసినవారు
రాయదుర్గం: రెండు వాహనాలు ఢీ
రాయదుర్గం పట్టణంలోని మొలకల్మూరు రోడ్డులో రెండు వాహనాలు ఢీకొని డ్రైవర్లకు స్వల్ప గాయాలైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రాయదుర్గం పట్టణానికి చెందిన బొలేరో వాహనం, కర్ణాటక చెందిన వడ్లలోడు లారీ ఢీకొనడంతో రెండు వాహనాలు ముందు భాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఎస్ఐ ప్రసాద్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ స్తంభించిపోయిన ట్రాఫిక్ ను నియంత్రించారు.

సంబంధిత పోస్ట్