జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలను నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు కల్పించాలని కళ్యాణదుర్గం డిఎల్డిఓ నాగేశ్వరరెడ్డి క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి, తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వలసల నివారణ చేయాలంటే రోజువారీగా 4500 మంది కూలీలకు పనులు కల్పించాలన్నారు.