రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో గుండెపోటు వచ్చిన వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే విలువైన ఇంజెక్షన్ ను వైద్యులు ఉచితంగా అందించనున్నారు. రూ. 45వేలు విలువైన ఈ ఇంజెక్షన్ ను ఆస్పత్రిలో అందుబాటులో ఉంచామని వైద్యులు శుక్రవారం విలేఖరులకు తెలిపారు. గుండెపోటు బాధితులకు అత్యవసర వైద్యం రాయదుర్గం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో అందుబాటులో ఉందని ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ మెర్సీ జ్ఞానసుధ తెలిపారు.