రాయదుర్గం పట్టణంలో కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10వ తేది జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రఘురామమూర్తి ఆదివారం విలేఖరులకు తెలిపారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీతో పాటు ఉన్నత చదువులు చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. తమ ఒరిజినల్ పత్రాలతో అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.