రాయదుర్గం 10వ వార్డులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది విజయాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతుందని తెలిపారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.