ఆటో బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన రాయదుర్గం సమీపంలో చోటుచేసుకుంది. శనివారం గుగ్గరట్టి కాలనీకి చెందిన సాకే ఇబ్రహీం కర్ణాటక రాష్ట్రం మొలకమ్మూర్ నుంచి రాయదుర్గానికి వస్తుండగా గాలిమారమ్మ గుడి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయనాయక్ తెలిపారు.