రైతులను నమ్మించి, తమ పేరుతో ఉన్న పాసుపుస్తకాలను పలు బ్యాంకుల్లో తనఖా పెట్టి ఏడు సంవత్సరాల క్రితం తీసుకున్న రూ. 11 కోట్లను తిరిగి చెల్లించకపోవడంతో తమ పరిస్థితి దయనీయంగా తయారయిందని పలువురు రైతులు నరేంద్రరెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కణేకల్లు మండలానికి చెందిన 42 మంది రైతులు గురువారం ఈ విషయంపై విలేకరులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. మోసం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.