కణేకల్ మండలంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో డా. బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద విద్యార్థిని చిన్న తిప్పమ్మ ఆత్మహత్యకు న్యాయం చేయాలనిశనివారం నిరసన నిర్వహించారు. పీడీఎస్యూ నేతలు తేజ జూనియర్ కాలేజీపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కళాశాలను సీజ్ చేయాలని, విద్యార్థిని ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.