రాయదుర్గం: హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తులు అరెస్టు

57చూసినవారు
బొమ్మనహాళ్ మండలం కల్లుహోలు గ్రామంలో సోమన్న గౌడ్ పై ఈ నెల13వ తేది రాత్రి జరిగిన హత్యాయత్నం కేసులో అదే గ్రామానికి చెందిన బి. గోవిందు, బి. జింకల వన్నప్పలను అరెస్టు చేశామని ఎస్ఐ నబీ రసూల్ మంగళవారం విలేఖరులకు తెలిపారు. వీరి నుంచి హత్యాయత్నంకు ఉపయోగించిన పిడిబాకు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సోమన్న గౌడ్ తన ఇంటి ముందర నిద్రించే సమయంలో ఈ ఇద్దరు నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు.

సంబంధిత పోస్ట్